ఉత్తర అమెరికా తెలుగు సంఘం(ఎన్.ఏ.టీ.ఎస్) బోర్డు డైరెక్టర్ గా వనపర్తి జిల్లా వాసి

by Ratna Kumari |

ప్రపంచంలో అగ్రగామిగా వెలుగొందుతున్న అమెరికా దేశంలోని "ఉత్తర అమెరికా తెలుగు సంఘం"(నాట్స్) బోర్డు డైరెక్టర్ గా వనపర్తి జిల్లా ఏదుట్ల గ్రామానికి చెందిన డా.పలుస సాయిప్రసాద్ గౌడ్ ఇటీవల ఎంపికయ్యారు.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(ఎన్.ఏ.టీ.ఎస్) బోర్డు డైరెక్టర్ గా వనపర్తి జిల్లా వాసి
X

దిశ, వనపర్తి : ప్రపంచంలో అగ్రగామిగా వెలుగొందుతున్న అమెరికా దేశంలోని "ఉత్తర అమెరికా తెలుగు సంఘం"(నాట్స్) బోర్డు డైరెక్టర్ గా వనపర్తి జిల్లా ఏదుట్ల గ్రామానికి చెందిన డా.పలుస సాయిప్రసాద్ గౌడ్ ఇటీవల ఎంపికయ్యారు. ఉత్తర అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న ఆయనను 2026-27 సంవత్సరానికి ఎంపిక చేశారు. గత రెండు దశాబ్దాలుగా అక్కడ ఉంటూ విద్యా ఉద్యోగాల నిమిత్తమై అక్కడికి వచ్చే తెలుగు వారికి తన వంతుగా చేయుతనిస్తూ సహకరిస్తున్నారు. సాయిప్రసాద్ గౌడ్ సేవలను గుర్తించిన అక్కడి తెలుగు సంఘం వారు ఆయనను బోర్డు డైరెక్టర్ ఎంపిక చేశారు. తన పదవీ కాలంలో తెలుగు ప్రజలకు సహకరించడమేగాక తెలుగు భాషా సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు మరింతగా కృషి చేస్తానని సాయిప్రసాద్ తెలిపారు. సాయిప్రసాద్ ఎంపిక పట్ల సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్, తెలుగు భాషా పరిరక్షణా సమితి జిల్లా అధ్యక్షుడు కందూరు నారాయణ రెడ్డి, సాహితీ వేత్తలు బైరోజు చంద్ర శేఖర్, డా.తూర్పింటి నరేష్ కుమార్, డా.అంబటి భాను, డా.శ్యాం సుందర్, డా.కంటే నిరంజనయ్య, డా. బండారు శ్రీనివాస్, సందాపురం బిచ్చయ్య, దేశి రాములు యాదవ్, గంధం నాగరాజు, ఉప్పరి తిరుమలేశ్, పావనం చంద్ర శేఖర్,శ్రీవర్ధన్ రెడ్డి,బాలస్వామి,యం.సుజాతమ్మ, చెన్న పద్మ సత్యనారాయణ హ‌ర్షం వ్య‌క్తం చేసారు.

Next Story