- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నలభై ఏళ్లుగా ఆ కుటుంబానికే సర్పంచ్ గా పట్టం
దిశ, మక్తల్ : నలభై సంవత్సరాలుగా ఆ కుటుంబానికే గ్రామస్తులు సర్పంచ్ పదవీని పట్టం కట్టారు. ఆ కుటుంబం ఐక్యంగా ఉంటూ

దిశ, మక్తల్ : నలభై సంవత్సరాలుగా ఆ కుటుంబానికే గ్రామస్తులు సర్పంచ్ పదవీని పట్టం కట్టారు. ఆ కుటుంబం ఐక్యంగా ఉంటూ గ్రామ సర్పంచ్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ గా వనజమ్మ కుటుంబ సభ్యులకే పదవులు దక్కుతాయి. గ్రామస్తుల ఆదరణకు వారు గ్రామాన్ని అభివృద్ధి దశలో తీసుకొచ్చారు. నాటి సర్పంచ్ శకుంతలమ్మ నుంచి మనవడు ప్రస్తుతం రాజేందర్ గౌడ్ సర్పంచ్ గా గ్రామస్తులు గెలిపించు కున్నారు. ఈ కుటుంబం రాజకీయ ప్రాబల్యం కోసం పార్టీలు మారిన గ్రామ అభివృద్ధి ని మరవకపోవడంతో గ్రామస్తులు ఆ కుటుంబ వ్యక్తిని సర్పంచ్ గా ఎన్నుకున్నారు. నియోజకవర్గం లోని మక్తల్ మండలంలోని రాజకీయ ఆధిపత్యం కోసం మంతన్ గోడు గ్రామానికి ఫ్యాక్ష నిస్టు చరిత్ర ఉంది. అదికారంలో ఎవ్వరూ ఉన్న గ్రామాభివృద్ధిలో ఇరు వర్గాలు చేతులు కలుపడం ప్రత్యేకత.
1990 శతకంలో రిటైర్డ్ తహశీల్దార్ భోజప్ప సతీమణి శకుంతలమ్మ రాజకీయంగా అరంగ్రేటం చేసి సర్పంచిగా నెగ్గారు నాటి నుంచి ప్రారంభమై మూడు తపాలుగా గ్రామ సర్పంచ్ గా పదవీ ని కట్టబెట్టారు. సొంత మరిది కోడలు సర్పంచ్ గా ఎంపీటీసీగా కొనసాగి కొత్తగా ఏర్పడిన నారాయణ పేట్ జిల్లా తొలి జిల్లా పరిషత్ చైర్మన్గా పదవిలో ఐదేళ్ల కాలం కొనసాగిన చరిత్ర ఉంది. ప్రస్తుతం జరిగిన సర్పంచ్ ఎన్నికలో శకుంతలమ్మ మనవడు రాజేందర్ గౌడ్ ను సర్పంచిగా ఎన్నుకోన్నారు. 40 ఏళ్ళు గా వీరి కుటుంబ సభ్యులు సర్పంచి నుండి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఈ కుటుంబ సభ్యుల ఉండడంతో వీరి హయాములోనే గ్రామంలో అంతర్గత రోడ్లు. డ్రైనేజీలు. తాగునీరు.వీధి దీపాలు పంచాయతీలో ఉండాల్సిన అన్ని పక్క భవనాలను అభివృద్ధి పరిచారు. జిల్లాలోని మంతన్ గౌడ్ గ్రామానికి ఓ ప్రత్యేకత పేరు రావడానికి కారణమై తమ కుటుంబ చేసిన అభివృద్ధికి చిన్న వయసులోనే తనకు సర్పంచ్ పదవి కట్టబెట్టిన గ్రామస్తుల అందరికీ అందు బాటులో ఉండి సర్పంచ్ నుండి మంత్రిగా ఎదిగిన వాకిటి శ్రీహరి తనకు రాజకీయంగా ఆదర్శమని ఆయన సహకారం తో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని రాజేందర్ గౌడ్ అన్నారు.






