కంపచెట్ల తొలగింపు పై హర్షం

by Nallavelli.Anjaneyulu |

దిశ, వీపనగండ్ల : మండల పరిధిలోని తూముకుంట లో గ్రామ సర్పంచ్ పలుస రామన్ గౌడ్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు

కంపచెట్ల తొలగింపు పై హర్షం
X

దిశ, వీపనగండ్ల : మండల పరిధిలోని తూముకుంట లో గ్రామ సర్పంచ్ పలుస రామన్ గౌడ్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సర్పంచ్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గ్రామంలో నెలకొన్న సమస్యలను దృష్టి సారించారు. ముఖ్యంగా తూముకుంట రైతు వేదిక నుంచి వల్లభాపూర్ కు వెళ్లే ప్రధాన రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లు పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. ఈ సమస్యను గుర్తించిన సర్పంచ్ పలుస రామన్ గౌడ్ గురువారం జేసీబీ తో రోడ్లకు ఇరువైపులా పెరిగిన కంపచెట్లను తొలగించటం మొదలుపెట్టారు. సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే గ్రామంలో మంచినీటి సౌకర్యం, పాఠశాలలో నెలకొన్న సమస్యలు, మురుగు కాలువ నిర్మాణం వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించిన‌ట్టు సర్పంచ్ రామన్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, రాంబాబు నాయుడు, నాయకులు మౌలాలి, ఎం,తిరుపతయ్య, ఎం,శేఖర్ యాదవ్, వెంకటస్వామి ఉన్నారు.

Next Story