మతిస్థిమితం లేని వ్యక్తిని కుటుంబ సభ్యులకు అప్పగింత

by Nallavelli.Anjaneyulu |

మతిస్థిమితం లేని వ్యక్తిని  కుటుంబ సభ్యులకు అప్పగింత
X

దిశ‌, మ‌ద‌నాపురం : మ‌తి స్థిమితం కోల్పోయిన వ్య‌క్తిని ఏపీలోని అన్న‌మ‌య్య జిల్లాకి చెందిన వారి కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు. కాంగ్రెస్ నాయకులు అంజద్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అన్నమయ్య జిల్లా చెందిన మూడు సంవత్సరాల క్రితం మతిస్థిమితం కోల్పోయి రామన్ పాడు గ్రామానికి తిరుగుతున్నాడు, అప్పటి నుంచి పఠాన్ ఖజా ఫీర్ ఖాన్ మామూలు వ్యక్తిగా మారాడు. అతను చెప్పిన ఇంటి చిరునామా ద్వారా అన్నమయ్య ఎస్పీకి ఫోన్‌ ద్వారా అంజద్ అలీ సమాచారం ఇచ్చారు. వారు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు ఆదివారం రామన్పాడు గ్రామానికి వచ్చి సమక్షంలో బాధితుడిని అప్పగించారు. స‌హ‌క‌రించిన ఎండి అంజన్ అలీ, ఎండి పాషా, కాజా నిజముద్దీన్, ఖలీల్ ల‌కు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు,

Next Story