- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుంటూరు కోల్డ్ స్టోరేజ్ ఘారానా మోసం
గద్వాల జిల్లా మానవపాడు రైతులకు కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం కోలుకోలేని షాక్ ఇచ్చింది. రెండేళ్ల క్రితం ధర రాక, భవిష్యత్ పై ఆశతో దాచుకున్న మిర్చి కాస్తా ఇప్పుడు 'మాయంస అయింది.

దిశ, మానవపాడు : గద్వాల జిల్లా మానవపాడు రైతులకు కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం కోలుకోలేని షాక్ ఇచ్చింది. రెండేళ్ల క్రితం ధర రాక, భవిష్యత్ పై ఆశతో దాచుకున్న మిర్చి కాస్తా ఇప్పుడు 'మాయంస అయింది. మెరుగైన ధర వస్తుందని ఆశించి మానవపాడుకు చెందిన సాయిబాబా, నాగశేషి, ఖలీం, లక్ష్మీనారాయణ రైతులు తమ మిర్చిని గుంటూరులోని లీలా గాయత్రి కోల్డ్ స్టోరేజ్‌లో భద్రపరిచారు. ఆ మిర్చి నిల్వలపై రుణాలు కూడా తీసుకున్నారు. తాజాగా మిర్చిని తీసుకునేందుకు వెళ్లగా "మీ మిర్చి ఇక్కడ లేదని యాజమాన్యం సమాధానం ఇవ్వడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
మాయమైన బస్తాలు..
సుమారు 1,148 బస్తాల మిర్చి అదృశ్యమైనట్లు తెలుస్తోంది. సాయిబాబా 677 బస్తాలు, నాగశేషి 213 బస్తాలు, గొల్ల రాముడు 140 బస్తాలు, గొల్ల బజారి 62 బస్తాలు, రమేష్ 56 బస్తాలను "కష్టపడి పండించిన పంటను నమ్మి దాచుకుంటే.. అక్రమంగా అమ్మేసి మమ్మల్ని నడిరోడ్డున పడేశారని రైతులు అపోతున్నారు. ఇది పక్కా ప్రణాళికతో చేసిన మోసం" అని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వ జోక్యం కోరుతున్న బాధితులు గుంటూరు యార్డ్ పరిసరాల్లో ఇలాంటి మోసాలు పెరిగిపోతున్నాయని, కోల్డ్ స్టోరేజ్యా జమాన్యాలు రైతుల సొమ్ముతో వ్యాపారం చేస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి, ఏపీ అధికారులతో మాట్లాడి తమకు న్యాయం చేయాలని లేదా నష్టపరిహారం ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.






