మన ఇసుక వాహనానికి అధికారిక అనుమతి మంజూరు

by Ratna Kumari |

మన ఇసుక వాహనానికి అధికారిక అనుమతి మంజూరు అయిందని త‌హ‌శీల్దార్ ముర‌ళీ మోహ‌న్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేశారు.

మన ఇసుక వాహనానికి అధికారిక అనుమతి మంజూరు
X

దిశ, వంగూర్ : నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలంలోని ఇసుక వినియోగదారులు శుక్రవారం నుంచి మన ఇసుక వాహనం ఆన్ లైన్ పోర్టల్ https//tgmiv.cgg.gov.in ద్వారా ఉల్పర, పోతారెడ్డిపల్లి ఇసుక రీచ్ ల నుంచి ఇంటి నిర్మాణం, ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ నిర్మాణాలు, ప్రభుత్వ కాంట్రాక్టులు, ఇసుక ట్రాక్టర్ల ద్వారా బుక్ చేసుకోవడానికి మైనింగ్ శాఖ అనుమతి ఇచ్చిందని మండల తహసిల్దార్ మురళీమోహన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇసుక అవసరమైన వారు ఆన్ లైన్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకుని అనుమతి పొందాలని సూచించారు.

Next Story