ఘనంగా... 'పోలేరమ్మ' ఉత్సవాలు

by Geesa Chandu |

మండల కేంద్రంలో ఘనంగా పోలేరమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

ఘనంగా... పోలేరమ్మ ఉత్సవాలు
X

దిశ, శ్రీరంగాపూర్: మండల కేంద్రంలో ఘనంగా పోలేరమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పొద్దున లేచి ఆడపడుచులు ఇంటి ముంగిట్లో సానుపు జల్లి, ఇల్లు కడుక్కుని, బోనం కుండలు తీసుకొచ్చి, వాటిలో అన్నం వండుకొని, పచ్చిపులుసు పిసికి, బోనం కుండకు సున్నంతో చుట్టూ రాస్తారు. కుంకుమ, పసుపుతో బొట్లు పెట్టి ఆడపడుచులు ఒక్కపొద్దు విడిచి, పోలేరమ్మ తల్లి గుడి చుట్టూ.. మూడు చుట్లు తిరిగి, వెంబడి తీసుకుపోయిన నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు. పిల్లలు, పెద్దలు, మేకలు, గొర్లు పశువులను చల్లగా కాపాడాలని మొక్కుబడి తీర్చుకొని ఇంటికి వస్తారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘంతో పాటు వివిధ సంఘాల సభ్యులు, మహిళలు, పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.

Next Story