- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెన్నచేడ్‌లో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ
గండీడ్ మండలంలోని వెన్నచేడ్ గ్రామంలో ఆదివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.

దిశ, మహమ్మదాబాద్/గండీడ్: గండీడ్ మండలంలోని వెన్నచేడ్ గ్రామంలో ఆదివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరై శివాజీ మహారాజ్‌కు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి ఆదిత్య పరశ్రీ స్వామీజీ, స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్,కరణం ప్రహ్లాద్ రావు బూనేటి కిరణ్, గ్రామ సర్పంచ్, గుర్రాల నవనీత్ చెన్నయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అతిథులు శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు....
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన అతిథులు ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, దేశభక్తి, స్వరాజ్య స్థాపన కోసం చేసిన త్యాగాలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని కొనియాడారు. యువత శివాజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశభక్తి, ధర్మ పరిరక్షణ, సమాజ సేవ, ప్రజాసంక్షేమం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. శివాజీ మహారాజ్ పరిపాలనా దక్షత, ప్రజల సంక్షేమం పట్ల ఆయనకు ఉన్న అంకితభావం నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు, యువకులు "జై శివాజీ", "జై భవాని" నినాదాలతో ప్రాంగణాన్ని మారుమోగించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాత వెన్న ఈశ్వరప్ప, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు,గంగుల అనంతలక్ష్మి రెడ్డి, మహమ్మదాబాద్ మండల అధ్యక్షుడు కేఎం నారాయణ వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య అత్యంత ఘనంగా జరిగింది.






