​నందిన్నెలో వైభవంగా ప్రతిష్ఠాపన మహోత్సవం.. పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల

by Kodari Anjali |

మండల పరిధిలోని నందిన్నె గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ధ్వజస్తంభం, నవగ్రహాలు మరియు బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

​నందిన్నెలో వైభవంగా ప్రతిష్ఠాపన మహోత్సవం.. పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల
X

దిశ,​ కె.టి.దొడ్డి: మండల పరిధిలోని నందిన్నె గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ధ్వజస్తంభం, నవగ్రహాలు మరియు బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం పీఠాధిపతి స్వామి వారిని దర్శించుకుని వేద ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో బడి, గుడి తప్పనిసరిగా ఉండాలని, దేవాలయాల వల్ల ప్రజల్లో భక్తిభావం పెరిగి ప్రశాంతత నెలకొంటుందని తెలిపారు. ఆలయ అభివృద్ధి తరహాలోనే, గ్రామ ప్రగతికి కూడా ప్రతి ఒక్కరూ ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్వామివారి అనుగ్రహంతో రైతులు, పాడి పరిశ్రమతో పాటు అన్ని రంగాలు వృద్ధి చెందాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. హిందూ ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చిన ఈ వేడుకతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ హనుమంతు స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story