కొనుగోలు చేసిన ధాన్యాన్ని తూకం వేసిన వెంటనే మిల్లులకు తరలించాలి : కలెక్టర్ విజయేందిర బోయి

by Nallavelli.Anjaneyulu |

దిశ, హన్వాడ : కొనుగోలు చేసిన ధాన్యాన్ని తూకం వేసిన వెంటనే మిల్లులకు తరలించాలని వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు.

కొనుగోలు చేసిన  ధాన్యాన్ని తూకం వేసిన వెంటనే మిల్లులకు తరలించాలి : కలెక్టర్ విజయేందిర బోయి
X

దిశ, హన్వాడ : కొనుగోలు చేసిన ధాన్యాన్ని తూకం వేసిన వెంటనే మిల్లులకు తరలించాలని వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. హన్వాడ మండల కేంద్రం లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(PACS) ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి శుక్రవారం తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో రైతులతో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తేమ శాతంను పరీక్షించి, నిర్ణీత తేమ,తాలు, మట్టి లేకుండా నాణ్యతా ప్రమాణాలు ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రం లో ధాన్యం వివరాలు,ట్యాబ్ ఎంట్రీ గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 2514 బస్తాల ధాన్యం ఉందని, ట్యాబ్ ఎంట్రీలో 1566 బస్తా లకు పూర్తి అయిందని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కలెక్టర్ కు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తూకం వేసిన వెంటనే మిల్లులకు తరలించాలని, రవాణా పరంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కొనుగోలు తర్వాత కేంద్రం నిర్వాహకులదే బాధ్యత అని, రైతులు మిల్లుకు వెళ్ళే అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్డీవో నవీన్ ఉన్నారు.

Next Story