- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెండ్
ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడిని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ సస్పెండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, మిడ్జిల్ : ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడిని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ సస్పెండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిడ్జిల్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సయ్యద్ ఖలీల్ పాషా, SA ఇంగ్లీష్ టీచర్ గా పని చేస్తున్నాడు. విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం, హాజరు రిజిస్టర్‌ను తారుమారు చేయడం, పాఠశాలకు సక్రమంగా హాజరు కాకపోవడం, పాఠశాలలో అతని ప్రవర్తన, ఉపాధ్యాయు మధ్య కోల్డ్ వార్, పాఠశాలలో పలు ఆరోపణలు విషయంలో జిల్లా విద్యాధికారి ప్రవీణ్ కుమార్ పై విచారణ చేపట్టారు. క్రమశిక్షణ చర్యలో భాగంగా ఉపాధ్యాయుడు సయ్యద్ ఖలీల్ పాషాను జడ్చర్ల మండలం పోలేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు డిప్యూటేషన్ పై బదిలీ చేశారు. గత వారం రోజుల క్రితం త్రీ మెన్ కమిటీ సభ్యులు మిడ్జిల్ పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య జరిగిన గొడవ , విధుల పట్ల నిర్లక్ష్యం తదితరాంశాలను పరిశీలించి నివేదికను కలెక్టర్ కి అందజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు.






