రేపు అచ్చంపేటకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాక

by Ratna Kumari |

దిశ, అచ్చంపేట : తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వర్మ రేపు అచ్చం పేట‌కు రానున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణం లోని ఆ

రేపు అచ్చంపేటకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాక
X

దిశ, అచ్చంపేట : తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వర్మ రేపు అచ్చంపేట‌కు రానున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణం లోని ఆదివారం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగే ఆదివాసి చెంచుల 108 జంటలకు వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే వివాహాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరవుతున్నారు. ఈ మేర‌కు గవర్నర్ కార్యాలయం నుంచి ప్రెస్ నోట్ శనివారం సాయంత్రం సంబంధిత అధికారులు విడుదల చేశారు. ఆదివారం ఉదయం 9:30 గంటలకు గవర్నర్ కార్యాలయం నుండి బయలుదేరి మధ్యాహ్నం సామూహిక వివాహాల కార్యక్రమంలో హాజరవుతారని.. అనంతరం సాయంత్రం తిరిగి రాజ్ భవన్ కు బయలుదేరి వెళ్తారని ఆ ప్రకటనలో తెలిపారు.

Next Story