- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు న్యాయమైన ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యం : జూపల్లి కృష్ణారావు
చిన్నంబావి మండలం కొప్పునూర్ గ్రామం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పప్పు శనగ కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రారంభించారు.

దిశ, చిన్నంబావి : చిన్నంబావి మండలం కొప్పునూర్ గ్రామం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పప్పు శనగ కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పండించిన శనగ పంటను మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,875/- కు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులకు న్యాయమైన ధర ను అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. కొనుగోలు ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలు పాటించడం ముఖ్యమని, శనగ లో 14 శాతం లోపే తేమ ఉండేలా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశిస్తూ, రైతులకు మద్దతుగా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లితో పాటు గ్రామ సర్పంచ్ బిచ్చన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు రామచంద్ర రెడ్డి, విద్యా సాగర్ రావు, బిచూపల్లి యాదవ్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, వ్యవసాయ శాఖ సిబ్బంది, మార్క్ ఫెడ్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.






