- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అందుకోసం ప్రజా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

దిశ, వీపనగండ్ల : అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అందుకోసం ప్రజా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మండలంలోని సంగినేనిపల్లి, కల్వరాల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం, కల్వరాల గ్రామంలో రూ. పది లక్షలు మహిళా సమాఖ్య భవనం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తోందన్నారు.
పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. గ్రామాభివృద్ధిలో అందరూ కలిసిరావాలని మండలంలో ఏ గ్రామంలో కూడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అప్పులకే వడ్డీలు కట్టడం కష్టంగా మారిందని, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుందని, అయినా కూడా ప్రజాసంక్షేమాని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ సర్పంచులు పల్ల జయంతి, బండారు రాములు,తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఏవో డాకేశ్వర్ గౌడ్, అంగన్వాడి సూపర్వైజర్ సోనీ,ఏఈలు, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.






