ప్ర‌భుత్వ భూములు ప్రైవేట్ వ్య‌క్తుల‌కు అమ్మ‌కూడ‌దు : సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యుడు బాల న‌ర‌సింహ

by Ratna Kumari |

దిశ, కొల్లాపూర్ : సీలింగ్, ప్రభుత్వ భూములు అన్యాక్రాంత‌మైతే అలాంటి భూములను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకాన్ని నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో గురువారం కొల్లాపూర్ త‌హ‌శీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు.

ప్ర‌భుత్వ భూములు ప్రైవేట్ వ్య‌క్తుల‌కు అమ్మ‌కూడ‌దు : సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యుడు బాల న‌ర‌సింహ
X

దిశ, కొల్లాపూర్ : సీలింగ్, ప్రభుత్వ భూములు అన్యాక్రాంత‌మైతే అలాంటి భూములను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకాన్ని నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో గురువారం కొల్లాపూర్ త‌హ‌శీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. అలాంటి భూముల గురించి అధికారులు పట్టించుకోవడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ, జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ ఆరోపించారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామ శివారులో సీలింగ్ భూమి సర్వే నెంబర్159, 164, 359, 364, 365 -46 ఎకరాలు అధికారుల నిర్లక్ష్యం మూలంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల నరసింహ, జిల్లా కార్యదర్శి ఎస్.ఎండి ఫయాజ్ ఆరోపించారు. 1995-96 సంవత్సరంలో వరకు సీలింగ్ భూములుగా ఉన్నాయని, వాటిని కొందరు వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. వెంటనే సీలింగ్ భూమిని స్వాధీనం చేసుకోవాలని సీపీఐ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి ప్రభుత్య భూముల అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కోరుతూ తహశీల్దార్ భరత్ కుమార్ కు వినతిపత్రాన్ని అందజేశారు. అంతకు ముందు సీపీఐ శ్రేణులు పట్టణంలో ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరి ముట్టడించారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి తుమ్మల శివుడు, పట్టణ కార్యదర్శి ఇసూప్,జిల్లా సీపీఐ నాయకులు టీ మల్లయ్య, విజేయుడు, శంకర్, సంగమోని కృష్ణ, ప్రకాష్, రమేష్, జంగం శివుడు, గానీకారి రామకృష్ణ,జి సత్యం శివ, ఇటుకల కృర్మయ్య, రవి పాల్గొన్నారు.

Next Story