- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు
ప్రైవేట్ కాలేజీలే కాదు.. ప్రభుత్వ కాలేజీల్లో చదివి ర్యాంకులు సాధించవచ్చు అని నిరూపించారు ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.

దిశ, మిడ్జిల్ : ప్రైవేట్ కాలేజీలే కాదు.. ప్రభుత్వ కాలేజీల్లో చదివి ర్యాంకులు సాధించవచ్చు అని నిరూపించారు ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు. ముఖ్యంగా ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. ఎంపీసీ, బైపీసీలో స్టేట్ ర్యాంక్ మార్కులు సాధించి, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారనీ కళాశాల ప్రిన్సిపల్ తిరుపతయ్య తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం లో 80 శాతం ఫలితాలతో మొత్తం 76 మంది విద్యార్థులు కు 61 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో ఆర్.సిద్దు 959 , జె .నరేష్ 923 , బైపీసీ ద్వితీయ సంవత్సరంలో బరిగెల అక్షిత 826, బి.అరుణ 804 ఉత్తమ మార్కులు సాధించారు.
ఎంపీసీ మొదటి సంవత్సరం శ్వేత 459, కృష్ణవేణి 431, బైపీసీ మొదటి సంవత్సరం లో బి .పావని 378 , జయంతి 352, సీఈసీలో కె.చందు 422 మార్కులు సాధించారు . ప్రథమ సంవత్సరంలో మొత్తం 68 మంది విద్యార్థులు కు 28 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు మంచి మార్కులు సాధించడంతో కళాశాల ప్రిన్సిపల్ తిరుపతయ్య, అధ్యాపకులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






