- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్‌కు షాక్.. గోపాల్ యాదవ్ రాజీనామా..!
రైతుబంధు సమితి మహబూబ్ నగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: రైతుబంధు సమితి మహబూబ్ నగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం ఆయన తన రాజీనామా లేఖను సమర్పించినట్లు తెలుస్తోంది. రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్‌తో ప్రారంభించిన గోపాల్ యాదవ్ 1975లో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ, కౌన్సిలర్‌గా పలుమార్లు ఎన్నికయ్యారు.
కొంతకాలం బీఆర్ఎస్‌లో కొనసాగిన గోపాల్ యాదవ్, మళ్లీ కాంగ్రెస్‌లో చేరినా.. 2018లో తిరిగి బీఆర్ఎస్‌కు వలస వచ్చారు. 2020లో రైతుబంధు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు బీఆర్ఎస్‌కి సేవలందిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.






