- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మత్స్యకారులకు ఇక నుంచి మంచి రోజులే : ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
దిశ, వనపర్తి : మత్స్యకారులకు ఇక నుంచి మంచి రోజులేనని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి,

దిశ, వనపర్తి : మత్స్యకారులకు ఇక నుంచి మంచి రోజులేనని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి కలిసి నల్లచెరువు నీటిలో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముదిరాజుల, మత్స్య సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.పెద్ద సామాజికవర్గమైన ముదిరాజ్, మత్స్యకారుల,అభివృద్ధికై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చట్టం ద్వారా కార్పొరేషన్ స్థాపించి మత్స్యకారులకు ఋణాలు, సామగ్రి సరఫరా, మార్కెటింగ్ సహాయం లాంటి అనేక సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలో సుమారు రెండు కోట్ల 20 లక్షల ఉచిత చేప పిల్లలను 957 విడుదల చేస్తున్నామన్నారు. తద్వారా మత్స్యకారులకు ఉపాధి కల్పించడంతోపాటు, మత్స్య సంపద అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి లక్ష్మప్ప, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్, వనపర్తి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, వనపర్తి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నందిమల్ల చంద్రమౌళిమున్సిపల్ మాజీ చైర్మన్ పుట్టపాకుల మహేష్, మాజీ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య పాల్గొన్నారు.






