- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంచనగుహకు బంగారు కాంతులు
దిశ, చిన్న చింతకుంట : తెలంగాణ తిరుపతిగా పేర్గాంచిన కురుమూర్తి స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం తొలిఘట్టం స్వర్ణాభరణాల

దిశ, చిన్న చింతకుంట : తెలంగాణ తిరుపతిగా పేర్గాంచిన కురుమూర్తి స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం తొలిఘట్టం స్వర్ణాభరణాల ఊరేగింపు అంబరాన్నంటింది. అమరచింత నుంచి పట్టు వస్త్రాలను పద్మశాలీలు తీసుకురాగా.. ఆత్మకూరు ఎస్‌బీఐ బ్యాంకులో భద్రపరిచిన స్వామివారి స్వర్ణ ఆభరణాలను బ్యాంక్ అధికారులు దేవస్థాన ఈవో మధనేశ్వర్ రెడ్డి, చైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డి, విశ్వకర్మ సమక్షంలో లాకర్ నుంచి స్వర్ణాభరణాల పెట్టెను బయటకు తీశారు. అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, రాజ శ్రీరామ్ భూపాల్, బాలల హక్కుల చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పాలక మండలి సభ్యులతోపాటు పలువురు వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఆనవాయితీ ప్రకారం గాడి వంశస్తులైన లక్ష్మీనారాయణ పెట్టెను తలపై పెట్టుకొని ఊరేగింపు ప్రారంభించారు.
ప్రధానంగా కేరళ కళాకారులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాయిద్యం అందరినీ ఆకట్టుకుంది. ఊరేగింపు పొడవునా వేలాదిగా భక్తులు స్వామివారి స్వర్ణాభరణాలను తాకి మొక్కేందుకు పోటీపడ్డారు. చెరువు కట్ట మీదుగా ఊరేగింపు మదనాపురం మండలం కొత్తపల్లికి చేరుకున్నది. ఈ సందర్భంగా గ్రామస్థులు, భక్తులు పూలు చల్లుతూ వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం దుప్పల్లి మీదుగా మధ్యా హ్నం అమ్మా పురం గ్రామంలోని ముక్కెర వంశానికి చెందిన రాజా రాంభూపాల్ నివాసానికి చేరుకున్నది. అక్కడ వేద పండితులు, అర్చకులు ఆభరణాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు ఆభరణాల పెట్టెను దర్శించుకున్నారు. అక్కడి నుంచి అమ్మాపురం ప్రధాన రహదారి మీదుగా సాయంత్రం అభరణాలు స్వామి వారి గుట్టకు చేరుకున్నాయి. అధికారుల సమక్షంలో అభరణాలను ఒక్కోటి పరిశీలించారు. ఆభరణాలను రాత్రి స్వామికి అలంకరించారు. దాంతో స్వామి వారి కాంచన గుహ, బంగారు కాంతులతో ధగధగలాడింది. కార్యక్రమంలో నాయకులు మాజీ జెడ్పి చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి,కొండా ప్రశాంత్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డి, నాగరాజు గౌడ్, వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు






