- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గృహ ప్రవేశం రోజే బంగారం చోరీ
దిశ, కల్వకుర్తి : కల్వకుర్తి పట్టణంలోని ఓ మంగళవారం తెల్లవారుజామున ఓ దుండకుడు చొరబడి సుమారు మూడు తులలాన్నర బంగారు ఆభరణాలు దోచుకెళ్ళాడు. వివరాల్లోకి వెళితే వంగూర్

దిశ, కల్వకుర్తి : కల్వకుర్తి పట్టణంలోని ఓ మంగళవారం తెల్లవారుజామున ఓ దుండకుడు చొరబడి సుమారు మూడు తులలాన్నర బంగారు ఆభరణాలు దోచుకెళ్ళాడు. వివరాల్లోకి వెళితే వంగూర్ మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ్ గౌడ్ కల్వకుర్తి పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో ఓ నూతన ఇంటిని కొనుగోలు చేసి తన బందు గణంతో సోమవారం గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించుకున్నాడు. అనంతరం సోమవారం రాత్రి నిద్రకు ఉపక్రమించారు. అంతకు ముందు రోజు నుంచి రెక్కి నిర్వహించిన దొంగ మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో ఇంటి ప్రహరీ గోడను దూకి కిటికిలోంచి చేయి పెట్టి మొదటి ద్వారం గడియ తీసి ఇంట్లోకి చొరబడ్డాడు. హల్లో గృహప్రవేశం సందర్భంగా ఏర్పాటుచేసిన దేవుని బొమ్మల మెడలో ఉన్న బంగారు గొలుసును తస్కరించి బెడ్ రూమ్ లోకి వెళ్లి నిద్రిస్తున్న మహిళ మెడలో ఉన్నమూడున్నర తులాల బంగారు గొలుసు లాక్కొని వెళ్ళాడు. ఈ విషయం గమనించిన ఆ మహిళ అరుపులు వేయగా దొంగ గోడ దూకి కాలనీ రోడ్డు లో పరుగులు తీస్తూ పారిపోయాడు. బాధితులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమివ్వగా ఘటన పూర్తి వివరాలు సేకరించి దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఘటన స్థలానికి సిఐ నాగార్జున, ఎస్ఐ మాధవ రెడ్డి లు చేరుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు. సిసి కెమెరాల ఆధారంగా దొంగ కదలికలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. బంగారం , వెండి ఆభరణాలు జాగ్రత్త పరుచుకోవాలని కల్వకుర్తి సిఐ నాగార్జున, ఎస్ఐ మాధవ రెడ్డి పట్టణ, గ్రామీణ ప్రజలకు సూచన ఇచ్చారు.






