ఘనంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి జన్మదిన వేడుకలు

by Web Desk |
ఘనంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి జన్మదిన వేడుకలు
X

దిశ, వెల్దండ: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మంగళవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపై ఎమ్మెల్సీ కి ఘన స్వాగతం పలికారు. అనంతరం కేక్ కట్ చేశారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీకి పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా చెరుకూరు సర్పంచ్ రేవతి రాజశేఖర్‌లు ఎమ్మెల్సీ కసిరెడ్డికి మెమొంటో‌ను అందజేశారు. అంతకముందు మండల పరిధిలోని పెద్దాపూర్‌లో ఎమ్మెల్సీ కసిరెడ్డికి మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కేక్ కట్ చేసి తినిపించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భూపతి రెడ్డి, కంటోనిపల్లి సర్పంచ్ పెద్ది రామకృష్ణ, ఎంపీటీసీలు, వైస్ ఎంపీటీసీ లు, వార్డు మెంబర్లు, ప్రజా ప్రతినిధులు తదితర నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed