- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేద కుటుంబానికి పుస్తె, మెట్టెలు అందజేత : జీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ కోన రాజశేఖర్
సమాజ సేవలో ముందుండే నాయకుడిగా పేరుగాంచిన జీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ కోన రాజశేఖర్ మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు.

దిశ, దేవరకద్ర : సమాజ సేవలో ముందుండే నాయకుడిగా పేరుగాంచిన జీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ కోన రాజశేఖర్ మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. అడవి అజిలాపూర్ గ్రామానికి చెందిన ఎరుకలి హనుమంత్-అనంతమ్మ దంపతుల కుమారుడు రాఘవేందర్ భారతి వివాహ వేడుకకు అవసరమైన పుస్తె మెట్టెలను అందజేసి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. వివాహ వేడుకకు అవసరమైన పుస్తె మెట్టెల కోసం కుటుంబ సభ్యులు జీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ కోన రాజశేఖర్‌ను సంప్రదించగా.. వెంటనే స్పందించారు. జీఎంఆర్ ఆదేశానుసారం ఎలాంటి ఆలస్యం చేయకుండా పుస్తె మెట్టెలను అందజేసి ఆ కుటుంబానికి పెద్ద సహాయంగా నిలిచారు. పెళ్లి వంటి శుభకార్యాల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సహాయం చేయడం సమాజంలో ఎంతో గొప్ప విషయం అని గ్రామస్థులు కొనియాడారు. ఇలాంటి సందర్భాల్లో ముందుకు వచ్చి సహాయం చేయడం ద్వారా పేద కుటుంబాలకు ఎంతో ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ కోన రాజశేఖర్ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకొని స్పందిస్తూ సహాయం చేయడం ఎంతో అభినందనీయమన్నారు. జీకేఆర్ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో మంచి పేరు సంపాదించారని తెలిపారు. ఇప్పటికే కోన రాజశేఖర్ గతంలో కూడా అనేక నిరుపేద కుటుంబాల వివాహాలకు పుస్తె మెట్టెలు అందజేసి సహాయం చేసిన విషయం స్థానికులు గుర్తు చేశారు. పేద కుటుంబాల పెళ్లిళ్లు సజావుగా జరగాలని భావించి అనేక సందర్భాల్లో ముందుకు వచ్చి సహాయం చేయడం ఆయన సేవా మనసుకు నిదర్శనమని గ్రామస్థులు తెలిపారు.






