అమ్మాయిలు ఉన్న‌త ల‌క్ష్యాల‌తో ముందుకెళ్లాలి : సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్

by Ratna Kumari |   (  Updated:2025-10-04 12:14:56  IST  )

దిశ, గద్వాల కలెక్టరేట్ : సమాజంలో ఆర్థికంగా, గౌరవప్రదంగా ఎదిగేందుకు అమ్మాయిలు ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ అన్నారు.

అమ్మాయిలు ఉన్న‌త ల‌క్ష్యాల‌తో ముందుకెళ్లాలి : సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : సమాజంలో ఆర్థికంగా, గౌరవప్రదంగా ఎదిగేందుకు అమ్మాయిలు ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ అన్నారు. సెర్ప్, యూనిసెఫ్ ఆధ్వర్యంలో శనివారం గద్వాల వజ్రా అభినందన్ బ్యాంకేట్ హాల్లో స్నేహ(సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్మెంట్ అండ్ హెల్త్ ఫర్ అడల్సేంట్ గర్ల్స్) సంఘాల కిషోర్ బాలికలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. విద్యాపరంగా, ఆర్థికంగా వెనకబడ్డ జోగులాంబ గద్వాల జిల్లాలో స్నేహ సంఘాలు బాలికల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తాయన్నారు. బాల్య వివాహల నిర్మూలనకు ఇప్పటికే ఎంవిఎఫ్ ఫౌండేషన్ కృషి చేస్తుండగా.. ప్రస్తుతం యూనిసెఫ్ సహకారంతో కిషోర బాలికల సాధికారతకు ముందుకెళ్లడం జరుగుతుందన్నారు. చదువు మానేసిన బాలికలు తిరిగి విద్యను అభ్యసించేందుకు ఓపెన్ టెన్త్, ఇంటర్ చదివేలా ప్రోత్సహించాలన్నారు. బాలికల సమస్యలు గుర్తించడంలో ఆయా గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులు తోడ్పాటు అందించాలన్నారు. స్నేహ సంఘాలు మన రాష్ట్రానికే కాక యావత్ దేశానికి రోల్ మోడల్ గా నిలవాలని ఆకాంక్షించారు.

అదనపు కలెక్టర్ నర్సింగరావు మాట్లాడుతూ స్నేహ సంఘాల సభ్యులు తమకు ఏ సమస్య ఉన్న సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. స్నేహ సంఘాల ద్వారా ఆధార్ కార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు లేనివారికి ఇప్పించడమే కాక బ్యాంకు ఖాతాలు సైతం ఓపెన్ చేయించడం జరుగుతుందన్నారు. జిల్లాలో 8వేల మందికి పైగా బాలికలు సంఘాల్లో ఉన్నారని.. ఇంకా సుమారు15వేల మంది బాలికలు సంఘాల్లో చేరాల్సి ఉందని తెలిపారు. చదువుతోపాటు ఆరోగ్యంపై దృష్టి సాధించినప్పుడే అనుకున్న లక్ష్యాలు నెర వేర్చుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో యూనిసెఫ్ ప్రతినిధులు మురళీకృష్ణ, మేరీ జో న్స్, ఇన్చార్జి డీఈఓ విజయలక్ష్మి, ఏపీడీ శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్వో సంధ్య కిరణ్మయి, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ప్రభావతి పాల్గొన్నారు.

Next Story