- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షేర్ మార్కెట్ లో పెట్టుబడి పేరుతో ఘరానా మోసం
22లక్షలు టోకరా, సైబర్ క్రైమ్ లో కేసు నమోదు

షేర్ మార్కెట్ లో పెట్టుబడి పేరుతో ఘరానా మోసం
- 22లక్షలు టోకరా, సైబర్ క్రైమ్ లో కేసు నమోదు
దిశ,ఉండవెల్లి: షేర్ మార్కెట్ పేరుతో సైబర్ క్రైమ్ నేరగాళ్లు రూ.22 లక్షలు టోకరా పెట్టిన ఘటన చోటు చేసుకున్నది. ఎస్సై శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు గ్రామానికి చెందిన గౌరెడ్డి వెంకటరెడ్డి సోషల్ మీడియాలో వచ్చిన గ్రోయాప్ లో రూ.50వేలు పట్టుబడి పెడితే రూ.3 లక్షలు వస్తాయని ప్రకటన చూసి జూన్ 25న రూ.లక్ష షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు. వెంటనే షేర్ మార్కెట్ నుండి రూ.3లక్షల డబ్బులు జమ అయినట్లు గ్రో యాప్ లో చూపించినట్లు తెలిపారు. ఇది నిజమే అని నమ్మిన గౌరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి జూన్ నుండి సెప్టెంబర్ వరకు రూ.22 లక్షలు ఆన్ లైన్ షేర్ మార్కెట్లో గ్రో యాప్ ద్వారా పెట్టుబడి పెట్టారు. గ్రో యాప్ లో రూ.50 లక్షల బ్యాలెన్స్ ఉన్నట్లు చూపించడంతో బ్యాంకుకు వెళ్లి డ్రా చేసుకుందామని వెళ్లిన గౌరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఎలాంటి బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలో లేదని బ్యాంక్ అధికారులు తెలిపారు. గ్రో యాప్ నిర్వాహకులకు ఫోన్ చేయడంతో రూ.13లక్షల ట్యాక్సీ కట్టాలన్నారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సెప్టెంబర్ 5న సైబర్ క్రైమ్ లో కేసు నమోదు చేశారు.






