పోలింగ్ స్టేష‌న్ ను త‌నిఖీ చేసిన జ‌న‌ర‌ల్ అబ్జ‌ర్వ‌ర్

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-12-05 16:21:18  IST  )

దిశ‌, మ‌క్త‌ల్ : నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని క‌ర్ని, పంచ‌దేవ్ ప‌హాడ్ గ్రామ‌పంచాయ‌తీ పోలింగ్ స్టేష‌న్ల‌ను రాష్ట్ర ఎన్నిక‌ల జ‌న‌ర‌ల్ అబ్జ‌ర్వ‌ర్ సీతారామ‌ల‌క్ష్మ‌మ్మ త‌నిఖీ చేశారు. ఎన్నిక‌ల

పోలింగ్ స్టేష‌న్ ను త‌నిఖీ చేసిన జ‌న‌ర‌ల్ అబ్జ‌ర్వ‌ర్
X

దిశ‌, మ‌క్త‌ల్ : నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని క‌ర్ని, పంచ‌దేవ్ ప‌హాడ్ గ్రామ‌పంచాయ‌తీ పోలింగ్ స్టేష‌న్ల‌ను రాష్ట్ర ఎన్నిక‌ల జ‌న‌ర‌ల్ అబ్జ‌ర్వ‌ర్ సీతారామ‌ల‌క్ష్మ‌మ్మ త‌నిఖీ చేశారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో భాగంగా నామినేష‌న్లు స్వీక‌రణ నుంచి త‌రువాత కౌంటింగ్ గెలిచిన స‌ర్పంచ్ పేరును ప్ర‌క‌టించేంత వ‌ర‌కు పంచాయ‌తీ పోలింగ్ స్టేష‌న్ల ద‌గ్గ‌ర మండ‌ల ఎన్నిక‌ల ఇన్ చార్జిగా ఉన్న‌తాధికారులు పంచాయ‌తీ పోలింగ్ బూతులు ద‌గ్గ‌ర ఏర్పాట్లు క‌ల్పించారా..? లేదా అనే విష‌యాల‌పై త‌నిఖీ చేసి క‌లెక్ట‌ర్ కి నివేదిక స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల అబ్జర్వర్ మండలంలో తనిఖీ చేస్తున్న విషయాన్ని పోలింగ్ కేంద్రాల వద్ద క్లస్టర్ల్ అధికార్లకు ప్రధాన రాజకీయ నాయకులకు ఎన్నికల అధికారి వస్తున్న విషయాన్ని తెలియపరచాల్సి ఉంటుంది. దీనివల్ల వారికి వచ్చే అనుమానాలపై నివృత్తి చేసుకోవడానికి వీలుండేది. ఎన్నికల నియమావళి ప్రకారం.. ఎన్నికలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఓటర్లు పోటీ చేసిన అభ్యర్థులకు ఎన్నికల అబ్జర్వర్ వస్తున్న విష‌యాన్ని మండల ఎన్నికల అధికారి ప్రచారం చేసి ఉండాలి.

కానీ అవేమీ లేకపోవడంతో పోలింగ్ బూత్ దగ్గర సమస్యలు ఎన్నికల అబ్జర్వర్ దృష్టికి తీసుకుపోవడానికి ఎవరూ ముందుకు లేకపోయారు. పంచాయతీ పోలింగ్ బూత్ వద్ద పోటీ చేసే అభ్యర్థులకు కూర్చోవడానికి కుర్చీలు రాసుకోవడానికి బల్లలు, చదువురాని అభ్యర్థులు నామినేషన్ పత్రాలను వ్రాయడానికి వాళ్లకు మార్గదర్శం చేసే సిబ్బంది ఏర్పాటు చేయాల‌ని, తాగునీటి సౌకర్యం, పోలింగ్ రోజు ఓటర్లకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాల‌ని సూచించారు. అలాగే వికలాంగులకు, వృద్ధులకు ఆడ, మగ అభ్యర్థులకు ప్రత్యేక లైన్ల ఏర్పాట్లు చేయాల‌ని అబ్జర్వేషన్ చేసి నిర్ధారణ నివేదికను జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ కి నివేదిస్తే జిల్లా ఎన్నికల అధికారి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది. కానీ మక్తల్ మండలంలో ఎక్కడా కూడా ఇలాంటి సౌకర్యాలు కల్పించలేదని పలువురు సర్పంచులు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అంత‌కు ముందు ప‌డ‌మ‌టి ఆంజ‌నేయ‌స్వామిని ద‌ర్శ‌నం చేసుకున్నారు రాష్ట్ర ఎన్నిక‌ల జ‌న‌ర‌ల్ అబ్జ‌ర్వ‌ర్ సీతారామ‌ల‌క్ష్మ‌మ్మ.

Next Story