గ్యాస్ సిలిండ‌ర్ లీక్.. చెల‌రేగిన మంట‌లు

by Nallavelli.Anjaneyulu |

నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని సురాపురం గ్రామంలో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు ఎగిసిపడిన సంఘటన గురువారం తీవ్ర కలకలం రేపింది.

గ్యాస్ సిలిండ‌ర్ లీక్.. చెల‌రేగిన మంట‌లు
X

దిశ, లింగాల : నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని సురాపురం గ్రామంలో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు ఎగిసిపడిన సంఘటన గురువారం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలు కాగా, గ్యాస్ సిలిండర్ పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గ్రామానికి చెందిన ముష్టిపల్లి శివ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఖాళీ అవ్వ‌డంతో కొత్త సిలిండర్ ఏర్పాటు చేశారు. సిలిండ‌ర్ కి వాచర్ స‌రిగ్గా లేకపోవడం వల్ల రెగ్యూలేటర్ పెట్టి ఓపెన్ చేసినప్పుడు గ్యాస్ లీకై గదిలో మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులు భయంతో కేకలు వేస్తూ బయటికి పరుగులు తీశారు. సిలిండర్ వద్ద రేగిన మంటలను ఆర్పే ప్రయత్నంలో ముష్టిపల్లి వెంకట స్వామికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 లో లింగాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు ఎస్సై వెంకటేశ్వర గౌడ్ ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.


ఎస్సై వెంకటేశ్వర్ గౌడ్ పర్యవేక్షణలో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. గ్యాస్ సిలిండర్ పెలక పోవడంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఎస్ఐ వెంకటేశ్వర్ గౌడ్ బాధిత కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఈ అగ్నిప్రమాదంలో ఇల్లు బీటలు వారగా, ఇంట్లో వంట సామాగ్రి, నిత్యవసర సరుకులు, విలువైన వివిధ ధ్రువ పత్రాలు, బట్టలు, ఫర్నిచర్, ఇతరత్ర వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి. పండుగ రోజున ఈ ప్రమాదం జరగడం తమను తీవ్ర భయాందోళను గురి చేసిందని, కట్టు బట్టలతో వీధిన పడ్డ తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వాపోయారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచి ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందజేసి విధంగా చర్యలు చేపడతానని సర్పంచ్ శేఖర్ బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు.

Next Story