- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న గ్యాస్ ఏజెన్సీ దారులు
Gas agencies operating at will

దిశ, వంగూర్ : మండల కేంద్రంలో శ్రీ సాయి అమృత ఇండియన్ గ్రామీణ్ విత్రక్ లో స్థానికంగా గ్యాస్ సరఫరాలో తీవ్ర అవ్యవస్థ నెలకొంది. గ్యాస్ సిలిండర్లు స్టాక్‌లో ఉన్నప్పటికీ, సరఫరా నిలిపివేయడం వల్ల వినియోగ దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవసరమైన సమయంలో గ్యాస్ అందక కొన్ని కుటుంబాలు వంట సమస్యలతో సతమతమవుతున్నారు. వినియోగదారుల ఆరోపణల ప్రకారం.. గ్యాస్ ఏజెన్సీ దారులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ సరఫరాను ఆలస్యం చేస్తున్నారని తెలిపారు. బుకింగ్ చేసినప్పటికీ రోజుల తరబడి సిలిండర్లు అందకపోవడం సాధారణంగా మారింది.
ఫోన్ కాల్స్ చేసినా సరైన స్పందన లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వృద్ధులు, మహిళలు గ్యాస్ కోసం గోదాం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు వినియోగదారులు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు సిలిండర్లు కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ సరఫరా వ్యవస్థను సక్రమంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. స్టాక్ ఉన్నప్పటికీ సరఫరా నిలిపివేయడంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






