గంజాయి పట్టివేత.. ఐదుగురు అరెస్ట్..!

by Ratna Kumari |

గంజాయి సేవిస్తున్న ఐదుగురిన అరెస్ట్ చేసి రిమాండ్ త‌ర‌లించిన ఘ‌ట‌న తెల‌క‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

గంజాయి పట్టివేత.. ఐదుగురు అరెస్ట్..!
X

దిశ‌, తెల్క‌ప‌ల్లి : గంజాయి సేవిస్తున్న ఐదుగురిన అరెస్ట్ చేసి రిమాండ్ త‌ర‌లించిన ఘ‌ట‌న తెల‌క‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై న‌రేష్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండలంలోని పర్వతాపూర్ గ్రామ శివారులో కొందరు యువకులు గంజాయి సేవిస్తున్నట్లు స‌మాచారం రావ‌డంతో సిబ్బందితో క‌లిసి అక్క‌డికి వెళ్లాం. చెట్ల పొదల్లో అనుమానాస్పదంగా కనిపించిన యువకులను పట్టుకొని విచారించగా.. జ‌హీర్ ఖాన్, బొమ్మ‌నోని సాయి, ర‌మావ‌త్ గోపి, ఎస్.కే. ఖాజా, కూరాకుల రామ‌కృష్ణ గంజాయి సేవిస్తున్న‌ట్టు తేలింది. గ‌త కొంత‌కాలంగా గంజాయి కొనుగోలు చేసి తాగుతున్నార‌ని గుర్తించారు. 12 గ్రాముల గంజాయి, 3 మొబైల్ ఫోన్లు, ఒక బైకు స్వాధీనం చేసుకొని కేసు న‌మోదు చేసి.. రిమాండ్ కి త‌ర‌లించిన‌ట్టు ఎస్సై వెల్ల‌డించారు.

Next Story