'నేనూ పెన్షనర్ బిడ్డనే'.. ఎమ్మెల్యే బండ్ల‌ భావోద్వేగం

by Nallavelli.Anjaneyulu |

దిశ, గద్వాల : తాను కూడా పెన్ష‌న‌ర్ల బిడ్డ‌నే అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా

నేనూ పెన్షనర్ బిడ్డనే.. ఎమ్మెల్యే బండ్ల‌ భావోద్వేగం
X

దిశ, గద్వాల : తాను కూడా పెన్ష‌న‌ర్ల బిడ్డ‌నే అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డు లో విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శ‌నివారం 43వ జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తన తండ్రి కూడా విశ్రాంత ఉద్యోగి అని, అందుకే తాను కూడా మీ కుటుంబ సభ్యుడినేనని పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న వారందరూ తన తండ్రి సమానులని కొనియాడారు. విశ్రాంత ఉద్యోగుల కోసం ప్రత్యేక భవన నిర్మాణం చేపట్టేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

గతంలో పెన్షనర్ల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని, కర్నూలు ఆస్పత్రుల్లో చికిత్స పొందేలా జీవో తీసుకువచ్చామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో ఆరోగ్య సేవల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కర్నూలుతో పాటు రాయచూరులో హెల్త్ కార్డుల ద్వారా వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, మాజీ కౌన్సిలర్లు నరహరి గౌడ్, శ్రీను ముదిరాజ్, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story