- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గద్వాల బిడ్డ రికార్డు.. ఇంటర్‌లో స్టేట్ సెకండ్ ర్యాంక్!
పేదరికం ఆమె ప్రతిభకు అడ్డు కాలేకపోయింది. తండ్రి పడే కష్టం ఆ అమ్మాయిని రాష్ట్ర స్థాయి విజేతగా నిలబెట్టింది.

దిశ, అలంపూర్ : పేదరికం ఆమె ప్రతిభకు అడ్డు కాలేకపోయింది. తండ్రి పడే కష్టం ఆ అమ్మాయిని రాష్ట్ర స్థాయి విజేతగా నిలబెట్టింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఎండి.సన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రదర్శనతో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు (State 2nd Rank) సాధించి చరిత్ర సృష్టించింది. కూతురి గెలుపుతో ఆటో డ్రైవర్ తండ్రి కళ్లలో ఆనందం జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రానికి చెందిన ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే మొల్ల మహబూబ్, తన ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా తన కూతురు మాత్రం గొప్పగా చదువుకోవాలని ఆశపడ్డారు. ఈరోజు సన సాధించిన విజయంపై ఆయన స్పందిస్తూ.. "ఆడపిల్లను చదివించాలనే నా కల నెరవేరింది. రాష్ట్ర స్థాయిలో ర్యాంకు రావడం గర్వంగా ఉంది" అని సంతోషం వ్యక్తం చేశారు.
కళాశాల బృందం అభినందనలు
గద్వాల పట్టణంలోని మైనార్టీ గురుకుల కళాశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సనను కళాశాల ప్రిన్సిపల్ పార్వతి మరియు అధ్యాపకుల బృందం ఫోన్ ద్వారా ప్రత్యేకంగా అభినందించారు. ఒక సామాన్య ఆటో డ్రైవర్ కుమార్తె రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం తమ కళాశాలకే గర్వకారణమని వారు కొనియాడారు. అధ్యాపకులు నిరంతరం విద్యార్థులను తమ బిడ్డలుగా భావించి చదివిస్తూ వసతి గృహంలో అలల పాలన చేయడం.. సన విద్యార్థి కష్టపడి చదవడంతో ఈరోజు స్టేట్లో రెండో ర్యాంకు తమ కళాశాలకు దక్కిందని గర్వించారు.






