స‌మాచారాన్ని క‌చ్చితంగా ఇవ్వాల్సిన బాధ్య‌త అధికారుల‌దే గ‌డ్డం శివకుమార్

by Ratna Kumari |

దిశ, వీపనగండ్ల : వివిధ అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వ అధికారిపై ఉందని మండల పౌర సమాచార అధికారి గడ్డం

స‌మాచారాన్ని క‌చ్చితంగా ఇవ్వాల్సిన బాధ్య‌త అధికారుల‌దే గ‌డ్డం శివకుమార్
X

దిశ, వీపనగండ్ల : వివిధ అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వ అధికారిపై ఉందని మండల పౌర సమాచార అధికారి గడ్డం శివకుమార్ అన్నారు. శనివారం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో 'సమాచార హక్కు చట్టం - 2005' జాతీయ వార్షిక వారోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు తమ హక్కులపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతోందని, ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత పెరిగిపోతుందని తెలిపారు.అధికారుల పనితీరులో బాధ్యతాభావం పెరగాలని, ప్రజల పట్ల మరింత సానుభూతితో వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో త‌హ‌శీల్దార్ వరలక్ష్మి, ఆర్ఐ కురుమూర్తి, రికార్డ్ అసిస్టెంట్ నరసింహ, భూభారతి ఆపరేటర్ రాము పాల్గొన్నారు.

Next Story