డ్రగ్స్‌ వల్ల యువత భవిష్యత్ ప్ర‌శ్నార్థ‌కం : ఎస్పీ వినీత్ కుమార్

by Ratna Kumari |   (  Updated:2025-11-25 02:14:18  IST  )

దిశ, నారాయణ పేట ప్రతినిధి: డ్రగ్స్‌ వల్ల యువత భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోందని యువతను డ్రగ్స్ అనే మహమ్మరి నాశనం చేస్తుందనీ ప్ర‌తి యువ‌తి, యువ‌కులు యాంటి డ్రగ్ సోల్జర్ గా పని చేయాలని

డ్రగ్స్‌ వల్ల యువత భవిష్యత్ ప్ర‌శ్నార్థ‌కం : ఎస్పీ వినీత్ కుమార్
X

దిశ, నారాయణ పేట ప్రతినిధి: డ్రగ్స్‌ వల్ల యువత భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోందని యువతను డ్రగ్స్ అనే మహమ్మరి నాశనం చేస్తుందనీ ప్ర‌తి యువ‌తి, యువ‌కులు యాంటి డ్రగ్ సోల్జర్ గా పని చేయాలని ఎస్పీ వినీత్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్. ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డ్రగ్స్‌ రహిత సమాజమే మన అందరి లక్ష్యంగా పని చేయాలన్నారు. నార్కోటి డ్రగ్ అనేది ఒక టెర్రరిస్ట్ లాంటిదన్నారు. డ్రగ్స్‌ వల్ల యువత భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోందని ఈ సమస్యను నిర్మూలించేందుకు ప్రతి పౌరుడు, ప్రతి తల్లిదండ్రులు, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి యువకుడు ముందుకు రావాలన్నారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్‌ అక్రమ రవాణా, విక్రయం లేదా వినియోగం చేస్తూ కనిపించినట్లయితే 1908 టోల్ ఫ్రీ నంబర్ లేదా డయల్ 100 కు వెంటనే సమాచారం పిలుపునిచ్చారు. పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజశేఖర్, సీఐ శివశంకర్, ఎస్ఐ లు వెంకటేశ్వర్లు, సునీత, బజరంగ్ దళ్ జిల్లా కార్యదర్శి కన్న శివకుమార్, అధ్యక్షులు వడ్ల శ్రవణ్, నగర అధ్యక్షుడు మురళి బట్టడ్, నరేష్, వెంకటరమణ వెంకటేష్, ఆకాష్ పాల్గొన్నారు.

Next Story