నియోజకవర్గాల పునర్విభజన పై తిమ్మాజీపేట మండలం భవిష్యత్

by Nallavelli.Anjaneyulu |

తెలంగాణ‌లో 119 నియోజకవర్గాల నుంచి 179 అంటే దాదాపు 60 నియోజకవర్గాల వరకు 26 పార్లమెంట్ స్థానాలకు పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్లు కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది.

నియోజకవర్గాల పునర్విభజన పై తిమ్మాజీపేట మండలం భవిష్యత్
X

దిశ, తిమ్మాజీపేట : అసెంబ్లీ ఎన్నికల వరకు నియోజకవర్గాల పునర్విభజన మహిళ రిజర్వేషన్ల ప్రక్రియ తప్పనిసరి ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోనే ఇప్పుడు ఉన్న 119 నియోజకవర్గాల నుంచి 179 అంటే దాదాపు 60 నియోజకవర్గాల వరకు 26 పార్లమెంట్ స్థానాలకు పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్లు కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కేంద్రం ప్రభుత్వం ముందుకు రావడం పలువురు హర్షం వ్యక్తం చేస్తూ జనాభా లెక్కల పూర్తయిన తరువాత నియోజకవర్గాల విభజన ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జడ్చర్ల నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి తిమ్మాజీపేట మండలం జడ్చర్ల నియోజకవర్గంలోనే ఉండే క్రమంలో మండల ప్రజలకు 12 కిలోమీటర్ దూర ప్రయాణం గల నియోజకవర్గం తో విభజించి దాదాపు 35 కిలోమీటర్ ఉన్న నాగర్ కర్నూలు నియోజకవర్గంలో అవకాశం కల్పించారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గంలోనే ఎన్నికలు కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత 2014 సాధారణ ఎన్నికల్లో జడ్చర్ల కాకుండా నాగర్ కర్నూల్ నియోజకవర్గం లో తిమ్మాజీపేట మండలానికి కలిపారు.


అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు మూడు సాధారణ ఎన్నికలు 2014, 2018, 2023 ఎన్నికలు పూర్తయ్యాయి. 12 కిలోమీటర్ దూరంలో ఉన్న జడ్చర్ల నియోజకవర్గంతో మండల ప్రజలకు విడదీయని బంధం పేగు బంధం అన్నట్టుగా ప్రతి ఒక్కరికి సౌకర్యకరంగా ఉండేది. ఇప్పుడు ఉన్న పరిస్తితి నీ బట్టి చూస్తే నాగర్ కర్నూలు నియోజకవర్గానికి ఏదైనా అవసరాలకు జిల్లా కలెక్టరేట్ రెవెన్యూ, జిల్లా అధికారులకు కలవడానికి అదేవిధంగా వేరేపనులకు వెళ్ళడానికి ప్రజలకు కష్టంగా మారింది. రాజకీయ నాయకులు తమ అవసరాలను బట్టి తమకు అనుకూలంగా ప్రయత్నం చేస్తూ ప్రజలకు నానా ఇబ్బందులను గురి చేస్తూ కాలం గడపడానికి చూస్తే మాత్రం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన పైనే తిమ్మాజీపేట మండల భవిష్యత్తు నిర్ణయిస్తూ కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సమలోచన చేస్తూ ప్రజలకు ఇబ్బందులకు గురి కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండే నియోజకవర్గం లో తిమ్మాజీపేట మండలానికి విలీనం చేస్తారని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి. చిన్న పనులకు పోవాలన్న మండల ప్రజలు జడ్చర్ల వైపు వెళ్లి పనులను పూర్తి చేసుకొని 15 నిమిషాల్లో గ్రామాలకు వెళ్లే సౌకర్యం ఉందని కనీసం ఇప్పటికైనా తమ మా మండలన్ని జడ్చర్ల నియోజకవర్గంలో విలీనం చేస్తే ప్రజలకు లాభం ఉంటుందని ప్రజల ఆశలు చిగురిస్తున్నాయి. పునర్విభజన అవకాశాన్ని ప్రజలకు దృష్టి లో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గం వద్దు.. జడ్చర్ల నియోజకవర్గం ముద్దు అన్ని ప్రజలు ఆశలు పెట్టుకుంటున్నారు.

Next Story