అశ్రునయనాల మధ్య ల‌క్ష్మారెడ్డి త‌ల్లి అంత్యక్రియలు

by Ratna Kumari |   (  Updated:2025-10-03 10:20:27  IST  )

తెలంగాణ మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి తల్లి బెత్తరిచర్ల కోల లక్ష్మమ్మ అంత్యక్రియలు శుక్రవారం మండల పరిధిలోని ఆవంచ

అశ్రునయనాల మధ్య ల‌క్ష్మారెడ్డి త‌ల్లి అంత్యక్రియలు
X

దిశ, తిమ్మాజిపేట : తెలంగాణ మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి తల్లి బెత్తరిచర్ల కోల లక్ష్మమ్మ అంత్యక్రియలు శుక్రవారం మండల పరిధిలోని ఆవంచ గ్రామంలో అశ్రునయనాల మధ్య జరిగాయి. వయోభారం, అనారోగ్యంతో మూడు రోజుల క్రితం కనుమూసిన లక్ష్మమ్మ మృతదేహాన్ని ఇవాళ ఉద‌యం వారి సొంత గ్రామానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వచ్చి లక్ష్మమ్మ మృత దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. సంవత్సరకాలం తేడాతో తల్లి, భార్య ఎడబాటు కావడంతో మనోవేదనతో ఉన్న లక్ష్మారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను పలువురు ప్రముఖులు పరామర్శించి మనోధైర్యం చెప్పారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్ రెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డి తదితరులు అంత్యక్రియలలో పాల్గొన్నారు.







Next Story