- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మృతుడి కుటుంబానికి రూ.51,300 ఆర్థిక సాయం అందించిన స్నేహితులు
by Kodari Anjali |
గోపాల్‌పేట మండల కేంద్రంలోని రామ్‌నగర్ కాలనీకి చెందిన కొంకలి రమేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.

X
దిశ, గోపాల్‌పేట: గోపాల్‌పేట మండల కేంద్రంలోని రామ్‌నగర్ కాలనీకి చెందిన కొంకలి రమేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో 1999–2000 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి బ్యాచ్ స్నేహితులు ముందుకు వచ్చారు. అందరూ కలిసి రూ.51,300 ఆర్థిక సాయం సేకరించి మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ నివాసానికి వెళ్లిన స్నేహితులు ఆయన భార్య, ఇద్దరు కుమారులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, భవిష్యత్తులో కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కవిత, పుష్పలత, జ్యోతి, ఆంజనేయులు, జి. చంద్రశేఖర్, వెంకటయ్య, గాజుల శేఖర్, సురేష్, నరేందర్ రెడ్డి, శ్రీశైలం, పర్శరాముడు, శ్రీనాథ్, రాజు, ఎ. చంద్రశేఖర్, గోపాల్ తదితర స్నేహితులు పాల్గొన్నారు.
Next Story






