ఉచిత ప‌శు గ‌ర్భ కోశ వ్యాధి నివార‌ణ చికిత్స శిబిరం ప్రారంభం

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, మ‌ల్ద‌క‌ల్ : మండ‌ల ప‌రిధిలోని కుర్తి రావుల చెరువు గ్రామంలో బుధ‌వారం ఉచిత పశుగర్భకోశ వ్యాధి

ఉచిత ప‌శు గ‌ర్భ కోశ వ్యాధి నివార‌ణ చికిత్స శిబిరం ప్రారంభం
X

దిశ‌, మ‌ల్ద‌క‌ల్ : మండ‌ల ప‌రిధిలోని కుర్తి రావుల చెరువు గ్రామంలో బుధ‌వారం ఉచిత పశుగర్భకోశ వ్యాధి నివారణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ జి. శివానంద స్వామి, గద్వాల ప్రాంతీయ పశువైద్యశాల ఏడీ డాక్టర్ రమేష్ హాజరై మాట్లాడారు. ఈ శిబిరంలో పశువులకు చెవులు పరీక్ష గర్భకోశ వ్యాధి చికిత్స అందించడం గురించి ప్రజలకు వివరించారు. అలాగే లేగ‌ దూడలకు నట్టల నివారణ, మందులు తాగించారు. చలికాలంలో పశువులకు వచ్చే రోగాల గురించి వివరించారు. తగు జాగ్రత్తలు సూచించారు. ఈ శిబిరంలో పశువైద్యాధికారులు డాక్టర్ వినయ్ కుమార్,ఉషా, యామిని సాయి వెంకట్ రాజు పసి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Next Story