రూ.కోటి వ్య‌యంతో లైబ్రరీ భవన నిర్మాణానికి శంకుస్థాపన

by Ratna Kumari |

కోటి రూపాయల వ్యయంతో కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని గ్రంథాలయ నిర్మాణానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి తిరుపతి రెడ్డి భూమి పూజ నిర్వహించారు.

రూ.కోటి వ్య‌యంతో  లైబ్రరీ భవన నిర్మాణానికి శంకుస్థాపన
X

దిశ‌, కోస్గి : కోటి రూపాయల వ్యయంతో కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని గ్రంథాలయ నిర్మాణానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి తిరుపతి రెడ్డి భూమి పూజ నిర్వహించారు. మంగళవారం ఆయన వివ‌రాల‌ను వెల్ల‌డించారు. రాబోయే రోజులలో గ్రంథాలయ నిర్మాణంతో విద్యావంతులకు జ్ఞాన నిధిని అందుబాటులో ఉంచేందుకు ఇది ఎంత దోహదపడుతుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టితో నిరుద్యోగ యువతకు ఉన్నత చదువులు చదివేందుకు అన్ని వసతులతో కూడిన విజ్ఞాన ఘనంగా కోస్గి గ్రంథాలయం నిర్మాణం పూర్తి చేసేందుకు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖడా చైర్మన్ వెంకటరెడ్డి, త‌హశీల్దార్ శ్రీనివాసులు, గ్రంధాలయ చైర్మన్ పార్ల విజయకుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘు వర్ధన్ రెడ్డి, మున్సిపల్ అధికారులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story