- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ సర్పంచ్ రాంరెడ్డి జయంతి వేడుకలు
దిశ, మిడ్జిల్ : మాజీ సర్పంచ్ రాంరెడ్డి పేదల ఆశాజ్యోతి అని జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో పెట్రోల్ బంక్ సమీపంలో మాజీ సర్పంచ్

దిశ, మిడ్జిల్ : మాజీ సర్పంచ్ రాంరెడ్డి పేదల ఆశాజ్యోతి అని జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో పెట్రోల్ బంక్ సమీపంలో మాజీ సర్పంచ్ రాంరెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. కీర్తిశేషులు రాంరెడ్డి సర్పంచ్ గా ఉన్న సమయంలో పేదల ఇండ్ల స్థలాల కోసం ఐదు ఎకరాల భూమి దానం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రామాభివృద్ధిలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్ రెడ్డి కుటుంబ సభ్యులు, నాయకులు సుదర్శన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ రబ్బాని, బాల్ రెడ్డి, అల్వాల్ రెడ్డి, బరిగెల వెంకటయ్య, సంపత్ కుమార్, నరేందర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, శంకర్, దేవయ్య, జహీర్, పర్వతాలు, ఉస్మాన్, రమేష్, వెంకటయ్య శివ, మల్లేష్ పాల్గొన్నారు.






