డీఎస్పీ సుజాతను సన్మానించిన మాజీ ఎంపీపీ

by Ratna Kumari |

దిశ‌, పాన్ గ‌ల్ : మండల పరిధిలోని బుసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొమారి సుజాత గ్రూప్ వన్ ఫలితాల్లో ప్రతిభ చాటి డీఎస్పీగా ఎన్నిక కావడంతో

డీఎస్పీ సుజాతను సన్మానించిన మాజీ ఎంపీపీ
X

దిశ‌, పాన్ గ‌ల్ : మండల పరిధిలోని బుసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొమారి సుజాత గ్రూప్ వన్ ఫలితాల్లో ప్రతిభ చాటి డీఎస్పీగా ఎన్నిక కావడంతో మంగళవారం వారి స్వగృహంలో మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రాంతం నుంచి గ్రూప్ 1 అత్యున్నత పోటీ పరీక్షల్లో విజయం సాధించడం హర్ష నియమన్నారు. సుజాత విజయం యువతకు స్ఫూర్తి దాయకమన్నారు. భవిష్యత్ లో రాష్ట్రంలోనే ఉన్నత పదవుల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాల్మీకి నాయుడు యూత్ అధ్యక్షుడు వెంకటేష్, బాలీశ్వరయ్య, జన్మ నాయుడు శివ గోవర్ధన్, హేమాద్రి పాల్గొన్నారు.

Next Story