- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండేళ్లలో చేసిన అభివృద్ధే లేదు : మాజీ ఎమ్మెల్యేలు
దిశ, మక్తల్ : రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏమి లేకనే తెలుసుకొని జనాలు సీఎం సభకు రాలేదని మంత్రి కంటతడి పెట్టారని మాజీ ఎమ్మెల్యే రాజేందర్, చిట్టే రామ్మోహన్ రెడ్డి అన్నారు.

దిశ, మక్తల్ : రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏమి లేకనే తెలుసుకొని జనాలు సీఎం సభకు రాలేదని మంత్రి కంటతడి పెట్టారని మాజీ ఎమ్మెల్యే రాజేందర్, చిట్టే రామ్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం చిట్టెం క్యాంపు కార్యాలయం లో పట్టణ అధ్యక్షుడు చిన్న హన్మంతు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి హాజరై మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాగు నీటీ ప్రాజెక్టులను పూర్తి చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు కట్ట కుండానే లక్షల ఎకరాలకు సాగునీరు ఎలా ఇచ్చారో చేపట్టాలన్నారు. నియోజకవర్గంలో విద్య, వైద్య అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. గతంలో మక్తల్ దవఖానాలో రికార్డు స్థాయిలో సాధారణ కాన్పులో చేసిన ఘనమైన చరిత్ర ఉందని ప్రస్తుతం ఆసుపత్రిలో వేళ్ల మీద లెక్కపెట్టే కాన్పులు జరుగుతున్నాయని మంత్రి సమాధానం చెప్పాలన్నారు.
గురుకుల హాస్టల్ లో కల్తీ ఆహారంతో ఇప్పటి వరకు వంద మంది విద్యార్థులు చనిపోయారని దానిపై ప్రభుత్వం సమాధానం ఇవ్వాలన్నారు. ప్రస్తుతం కొడంగల్ ఎత్తిపోతల పథకం బోగస్ పథకమని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దండుకోవడానికి భూగర్భం లో బారిపైపులను వేసి ఎత్తిపోతల పథకం నీళ్ళు తీసుకేళ్ళడం అంచనాలు పెంచడానికే అన్నారు. ఈ పథకం పై కోర్టులో గ్రీన్ ట్రిబ్యునల్ కొనసాగుతుందని.. ఎన్విరాన్ మెంట్ ఇతర పర్యావరణ అనుమతి లేదన్నారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం పేరు ప్రజాధనాన్ని దండుకునేందుకు అక్కడక్కడ పైపులు వేసి ఇప్పటివరకు కోట్లాది రూపాయల బిల్లులు డ్రా చేసుకొని కమీషన్లు పంచుకున్నారని పేర్కొన్నారు. సంగంబండ బ్యాక్ వాటర్ నుంచి నేరుగా చెరుకు నీటిని తీసుకెళ్లి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా సాగునీళ్లు వదిలే వీలు ఉన్న భూగర్భంలో పైపులు వేసి నీటిని తీసుకెళ్లడానికి పథకాన్ని రూపొందించడంతో అంచనాలు పెంచి కోట్ల రూపాయల ధనాన్ని దండుకునేందుకు కొడంగల్ నారాయణ పేట్ మక్తల్ ప్రాజెక్ట్ అని ఆరు నెలలకొకసారి ప్రాజెక్ట్ రూపును మార్చుతున్నారని తెలిపారు. అందుకు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కి ప్రజలు తగిన బుద్ది చెబుతారని పేర్కొన్నారు.
గురుకులాల్లో విద్యార్థులకు పెట్టే ఆహారం వికటించి 100 మంది విద్యార్థులు చనిపోయారని.. డిగ్రీ కళాశాల, కోర్టు తన హయాంలో వచ్చాయన్నారు. ప్రస్తుతం మంత్రి చెప్పుకోవడమే తప్పు అన్నారు. చేసిన అభివృద్ధి ఏమి లేకపోవడం వల్లనే సోమవారం సీఎం రేవంత్ రెడ్డి సభకు జనాలు రాలేదని.. మంత్రి కంటతడి పెట్టుకున్నారని పేర్కొన్నారు. జిల్లాలో విద్య, వైద్యం ఘోరంగా దెబ్బతినిందని పాఠశాలలో బోధించేందుకు ఉపాధ్యాయులు లేక ఎప్పుడు కూసున్నయో చెడిపోయిన బిల్డింగులు విద్యార్థులు క్లాస్ లో కూర్చోవాలన్న భయపడ్తున్నా రని ఆయన అన్నారు . గతంలో బీఆర్ఎస్ పాలనలో మక్తల్ ఆసుపత్రిలో రికార్డు స్థాయిలో సాధారణ కాన్పులు జరిగాయని కానీ ఇప్పుడు నెలకు పట్టుమని పది కాన్పులు కూడా జరగడం లేదు ఎందుకని ప్రశ్నించారు. వైద్య సిబ్బంది ఉన్నా సొంత ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారని మంత్రి వాకిటి శ్రీహరి సమాధానం చెప్పాలన్నారు. కార్యక్రమంలో మహిళా జిల్లా నాయకురాలు చిట్టెం సుచరిత శ్రీనివాస్ గుప్తా, రాజేష్ గౌడ్, నరసింహా గౌడ్ పాల్గొన్నారు.






