- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు.

దిశ, కందనూల్ : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గురువారం నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 12, 13 వార్డుల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామ దేవతలు బొడ్రాయి, పోచమ్మ, ఈదమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయా వార్డుల పరిధిలోని కాలనీల్లో పర్యటిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మర్రి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేండ్లుగా నాగర్ కర్నూల్ పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. మార్పు పేరుతో 6 గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మున్సిపల్ ఎన్నికల్లో బొంద పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే ప్రచారానికి వచ్చినప్పుడు సమస్యలపై నిలదీయాలని, ప్రశ్నించాలని ప్రజలకు సూచించారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాలు గెలిచుకుని బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా సరే కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు గెలిస్తే కోట్లాది రూపాయలు కేటాయించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పది సంవత్సరాల్లో నాగర్ కర్నూల్ పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చేసిన పనులకు కేవలం రిబ్బన్ కటింగ్‌లు చేస్తూ తిరుగుతోందని ఎద్దేవా చేశారు. రెండు సంవత్సరాలుగా మాయ మాటలతో కాలం గడుపుతూ ప్రజలను మభ్యపెడుతోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






