మాజీ మంత్రి మ‌హేంద్ర నాథ్ సోద‌రుడు కృష్ణ‌య్య మృతి తీర‌ని లోటు

by Ratna Kumari |

దిశ‌, కంద‌నూల్ : రాష్ట్ర మాజీ మంత్రి దివంగత నేత, విద్యావేత్త పుట్టపాగ మహేంద్రనాథ్ సోదరుడు జాతీయ ఉన్నత పాఠశాల విశ్రాంత ఉపాధ్యాయుడు కిష్టయ్య

మాజీ మంత్రి మ‌హేంద్ర నాథ్ సోద‌రుడు కృష్ణ‌య్య మృతి తీర‌ని లోటు
X

దిశ‌, కంద‌నూల్ : రాష్ట్ర మాజీ మంత్రి దివంగత నేత, విద్యావేత్త పుట్టపాగ మహేంద్రనాథ్ సోదరుడు జాతీయ ఉన్నత పాఠశాల విశ్రాంత ఉపాధ్యాయుడు కిష్టయ్య మృతి వారి కుటుంబానికే కాకుండా సమాజానికి తీరని లోటు అని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఫోరమ్ అధ్యక్షుడు జెట్టి ధర్మరాజు అన్నారు. నాగర్ కర్నూల్ మండలం నల్లవెల్లి గ్రామంలో బుధవారం ఆయన అంత్య క్రియల్లో పాల్గొని సమాధి వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పేదల విద్యాభివృద్ధి కోసం మాజీ మంత్రి మహేంద్రనాథ్ స్థాపించిన జాతీయోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసిన అయన సోదరుడు కిష్టయ్య ఎంతో మంది విద్యార్థులకు విద్య బోధనా చేశారని తెలిపారు. ఆయన శిష్యులు ఎంతో మంది డాక్టర్లుగా, లాయర్లు, ఇంజనీర్లు, టీచర్లు, రాజకీయ నాయకులు, సైంటిస్టులుగా తయారయ్యారని తెలిపారు. ఆయన గొప్ప మానవతావాది అని జెట్టి ధర్మరాజు కిష్టయ్యను కొనియాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాజీ మంత్రి మహేంద్రనాథ్ ఆశయాల వారసుడు కిష్టయ్య మృతి సమాజానికి ఎంతో లోటన్నారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా అండదండగా ఉంటామని జట్టి ధర్మరాజు భరోసా ఇచ్చారు. కిష్టయ్య కుటుంబానికి వారి వారసులకు మనో ధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, కావలి శ్రీనివాసులు, దేవరపాక రాజు, బండి చెన్నయ్య, కరెంటు బాలస్వామి, పరశురాములు, గంగాధర్, బండి నరసింహా, రాజగోపాల్, రాంచందర్ పాల్గొన్నారు.

Next Story