ఇదేనా ప్రజా పాలన.. శవానికే రక్షణ లేదు..!

by Nallavelli.Anjaneyulu |

జడ్చర్ల ప్రభుత్వ దవాఖానాలో శవాన్ని కుక్కలు పిక్కు తినడం అత్యంత దారుణమైన ఘటన అని.. ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం అని మాజీ మంత్రి బీఆర్ఎస్ మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

ఇదేనా ప్రజా పాలన.. శవానికే రక్షణ లేదు..!
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల ప్రభుత్వ దవాఖానాలో శవాన్ని కుక్కలు పిక్కు తినడం అత్యంత దారుణమైన ఘటన అని.. ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం అని మాజీ మంత్రి బీఆర్ఎస్ మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ దవాఖానాలో సోమవారం మార్చరీలో ఉన్న శవాన్ని కుక్కలు పీక్కుతిన్న‌ ఘటన పై ఆయన స్పందించారు. మంగళవారం దవాఖానాను సందర్శించి, అక్కడి నుంచి 100 పడకల ప్రభుత్వ ప్రాంతీయ దవాఖానాకు చేరుకొని మీడియాతో మాట్లాడారు. ప్రాంతీయ దవాఖానాలో మార్చురి గది నిర్మాణం పూర్తయి ఏడాదిన్నర అవుతున్న ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ప్రారంభానికి నోచుకోలేదన్నారు. మార్చరుని ప్రారంభిస్తే ఈ ఘటన జరిగేది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ పాత రోజులు తెస్తాం అన్న మాటను ఇవాళ‌ నిజం చేసింది అన్నారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలోనూ ఎక్కడా కూడా ప్రభుత్వ దవాఖానాల్లో మెరుగైన వైద్యం అందంగా సరైన మందులు లేక నిర్లక్ష్యానికి గురవుతున్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల దబాఖానాలో జనరేటర్ లేదు అని అన్న విషయాన్ని గుర్తు చేశారు. అవాస్తవాలను మాట్లాడిన రేవంత్ రెడ్డి కి కౌంటర్ గా జనరేటర్ ఉన్న విషయాన్ని తమ పార్టీ నాయకులు మరుసటి రోజునే దవాఖానాకు వెళ్లి చూపించి నిరూపించారని, ప్రస్తుతం ప్రజా పాలనలో మార్చురీలో ఫ్రీజర్, సెక్యూరిటీ కనీస సౌకర్యాలు కూడా లేవని నేడు శవాలను కుక్కలు తినే దారుణ దుస్థితి ఏర్పడిందన్నారు. పేదలంటే ఇంతటి నిర్లక్ష్యమా అంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఇన్ చార్జిగా ఉన్న జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా జిల్లాల్లో ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు.

ఈ ప్రభుత్వానికి నాయ‌కుల‌ మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అన్నారు. వంద రోజుల్లోనే పూర్తిస్థాయిలో స్టాఫ్ నియమిస్తామని చెప్పి ఇప్పటికీ అతి గతి లేదని మండిపడ్డారు. ఇంతటి దారుణ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ దవాఖానాను 100% బలోపేతం చేసి వైద్యులను నియమించాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వంలోని మంత్రి, నాయకులు రాజీనామా చేయాలి. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ జిల్లా ఇన్ చార్జి మంత్రిగా ఉన్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తోపాటు స్థానిక ప్రజా ప్రతినిధి రాజీనామా చేయాలని గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రాజకీయ నాయకులు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారని ఈ ఘటనలో ప్రభుత్వాన్ని 90% తప్పుంటే అధికారులు 10% తప్పు ఉందని ఈ ఘటన పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఇందులో అధికారులను మాత్రమే బలిపశువును చేయడం సబబు కాదన్నారు. ఆయ‌న వెంట బీఆర్ఎస్ కౌన్సిల‌ర్లు, నాయ‌కులు ఉన్నారు.

Next Story