- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేద విద్యార్థుల వైద్య విద్య కలను సాకారం చేసిన ఘనత కేసీఆర్‌దే : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
దిశ, జడ్చర్ల : పేద, సామాన్య కుటుంబాల విద్యార్థులు వైద్య విద్య చదవాలనే కలను సాకారం చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని మాజీ ఆరోగ్యశాఖ మంత్రి

దిశ, జడ్చర్ల : పేద, సామాన్య కుటుంబాల విద్యార్థులు వైద్య విద్య చదవాలనే కలను సాకారం చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని మాజీ ఆరోగ్యశాఖ మంత్రి డా. సీ. లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. జిల్లా వారీగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను స్థాపించాలన్న కేసీఆర్ దూరదృష్టితోనే, నేడు తెలంగాణలో వైద్య విద్య సామాన్యులకు చేరువైందన్నారు. తాను ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఆమోదం పొందించడం గర్వకారణం అని తెలిపారు. మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థిని వనపర్తి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించిన ప్రియా ఏంజెల్ ను డా. లక్ష్మారెడ్డి అభినందించారు. ఆ యువతి భవిష్యత్తులో ప్రజాసేవకు అంకితం కావాలని సూచించారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాభిప్రాయం, ప్రజల ఆశీస్సులు మించినవి లేవు. నేడు ఆ ఫలితం రూపంలో ప్రియా నిలిచిందని అన్నారు. జహీరాబాద్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ లో మెడికల్ సీట్లు సాధించిన 15 మందిలో ప్రియా ఏంజెల్ కూడా ఒకరు. 6వ తరగతి నుంచి కేసీఆర్ స్థాపించిన మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజ్ లోనే చదివిన ప్రియా మెడికల్ సీటు సాధించడం మన అందరికీ గర్వకారణం అని అన్నారు. వనపర్తి వంటి వెనుకబడిన జిల్లాలో మెడికల్ కాలేజ్ రావడం, స్థానిక విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు కలగడం కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమైందని తెలిపారు.






