భార్య మందలింపుతో భర్త బలవన్మరణం

by Nallavelli.Anjaneyulu |

దిశ, నవాబుపేట : భార్య మంద‌లింపుతో భ‌ర్త బ‌ల‌వ‌న్మ‌ర‌ణం పొందిన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై విక్ర‌మ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..

భార్య మందలింపుతో భర్త బలవన్మరణం
X

దిశ, నవాబుపేట : భార్య మంద‌లింపుతో భ‌ర్త బ‌ల‌వ‌న్మ‌ర‌ణం పొందిన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై విక్ర‌మ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండ‌ల ప‌రిధిలోని జంగ‌మ‌య్య గ్రామానికి క‌మ్మ‌రి ఆచారి(45) అనే వ్య‌క్తి క్ష‌ణికావేశానికి లోనై క్రిమి సంహారక ముందు సేవించి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈనెల 04న క్రిమిసంహార‌క మందు సేవించి ఆత్మ‌హ‌త్యాయ‌గ్నం చేసిన ఆయ‌న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ శుక్ర‌వారం మృతి చెందాడు. బోరు మోటార్ మెకానిక్ గా ప‌ని చేసే ఆచారి ప్ర‌తిరోజూ మాదిరిగానే సాయంత్రం మ‌ద్యం సేవించి ఇంటికి వ‌చ్చారు. భార్య రాధ‌మ్మ మ‌ద్యం సేవించినందుకు ఆయ‌న‌తో గొడ‌వ‌ప‌డింది. దీంతో ఆ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచారి అదేరోజు రాత్రి ఇంటి పైకి వెళ్లి క్రిమిసంహార‌క మందు సేవించి ఆత్మాహ‌త్యాయ‌గ్నం చేశాడు. గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు వెంట‌నే 108 అంబులెన్స్ లో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ శుక్ర‌వారం ఆచారి మృతి చెందాడు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు ఎస్సై విక్ర‌మ్ వెల్ల‌డించారు.

Next Story