కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుగా రెండోసారి కే. ప్రశాంత్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

దిశ, నారాయణపేట ప్రతినిధి : నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా రెండోసారి కె. ప్రశాంత్ రెడ్డి నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడి స్థానం కోసం తీవ్ర పోటీ ఉన్నప్పటికీ అవకాశం మరికల్ మండలం తీలేరు గ్రామానికి

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుగా రెండోసారి కే. ప్రశాంత్ రెడ్డి
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా రెండోసారి కె. ప్రశాంత్ రెడ్డి నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడి స్థానం కోసం తీవ్ర పోటీ ఉన్నప్పటికీ అవకాశం మరికల్ మండలం తీలేరు గ్రామానికి చెందిన కే . ప్రశాంత్ రెడ్డికి వరించింది. 1975 మే 8వ తేదీన జన్మించిన ప్రశాంత్ రెడ్డి మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేశాడు. ఈయన తండ్రి వీరారెడ్డి రెండు పర్యాయాలు కాంగ్రెస్ నుంచి అమరచింత ఎమ్మెల్యేగా గెలుపొందారు. డీసీసీబీ చైర్మన్ గా కూడా ఈయన తండ్రి పనిచేశారు. తాతలు కూడా రాజకీయంగా పలుకుబడి ఉన్నవారు కావడం ప్రశాంత్ కుమార్ రెడ్డి చూపు రాజకీయంలోకి తీసుకోవచ్చింది. తండ్రి బాటలోనే తనయుడిగా 1992 లో అమరచింత ఎన్ ఎస్ యుఐ నియోజకవర్గ ఇన్ చార్జి, యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పనిచేస్తూ వచ్చారు. నారాయణపేట జిల్లా అధ్యక్షులుగా పని చేసిన వాకిటి శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి కావడంతో కొన్ని రోజులపాటు కాంగ్రెస్ అధ్యక్షులుగా ప్రశాంత్ రెడ్డి పని చేశారు. తిరిగి పార్టీ జిల్లా అధ్యక్షుని పదవి కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో రెండోసారి అవకాశం కోసం ప్రయత్నించి ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షులు కొండ ప్రశాంత్ రెడ్డి దిశతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని.. జిల్లా మంత్రి, ఎమ్మెల్యేల సూచనలు, సలహాలు తీసుకుంటూనే పార్టీని బలోపేతం చేస్తాన‌న్నారు.

Next Story