ఫిట్ నెస్, లైసెన్స్ లేని వాహ‌నాల‌పై దృష్టి సారించాలి : క‌లెక్ట‌ర్ బాదావ‌త్ సంతోష్

by Ratna Kumari |

దిశ‌, నాగ‌ర్ క‌ర్నూల్ : జిల్లాలో ఫిట్ నెస్ లేని వాహ‌నాల‌పై లైసైన్స్ లేకుండా వాహ‌నాలు న‌డిపే చోదకుల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని ఆర్డీవోను క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

ఫిట్ నెస్, లైసెన్స్ లేని వాహ‌నాల‌పై దృష్టి సారించాలి : క‌లెక్ట‌ర్ బాదావ‌త్ సంతోష్
X

దిశ‌, నాగ‌ర్ క‌ర్నూల్ : జిల్లాలో ఫిట్ నెస్ లేని వాహ‌నాల‌పై లైసైన్స్ లేకుండా వాహ‌నాలు న‌డిపే చోదకుల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని ఆర్డీవోను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. గురువారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలు, ఫ్లెక్సీలను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జనవరి 1 నుంచి 31 వరకు రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించడం ద్వారా అనేక విలువైన ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదు, రాంగ్ రూట్‌లో ప్రయాణించడం, అతివేగం నివారించాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో రహదారి భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా ర‌వాణా అధికారి చిన్న బాలు, ర‌వాణా అధికారి పాల్గొన్నారు.

Next Story