- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏడేళ్ల బాలికపై ఐదుగురు మైనర్ బాలుర్లు లైంగిక దాడి
మున్సిపాలిటీలోని ఓ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలికపై ఐదుగురు మైనర్ బాలుర్లు అత్యాచారం చేసిన ఘటన జడ్చర్ల మున్సిపాలిటీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, జడ్చర్ల : మున్సిపాలిటీలోని ఓ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలికపై ఐదుగురు మైనర్ బాలుర్లు అత్యాచారం చేసిన ఘటన జడ్చర్ల మున్సిపాలిటీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలికపై అదే ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న మరో ఐదుగురు మైనర్ బాలురు ఆటాడుకుంటూ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాలిక రెండు రోజుల నుంచి జ్వరం రావడంతో బుధవారం బాలిక తల్లి బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ పరిశీలించిన వైద్యురాలు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారన్న విషయాన్ని గ్రహించి స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. దీంతో రంగంలోకి దిగిన జడ్చర్ల పోలీసులు బాలికను జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రానికి తరలించారు.
అక్కడ బాలిక ద్వారా జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వారు సేకరించారు. బాలికపై అఘాయిత్యం జరిగిన మాట వాస్తవమేనని తేలడంతో జడ్చర్ల పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో బాధితురాలి తో పాటు నిందితులు కూడా మైనర్లు కావడంతో ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా లేక ఏదైనా ఆటాడుకుంటూ అఘాయిత్యానికి పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటన విషయం బయటికి తెలియడంతో జడ్చర్ల పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. మరి ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలను ఆడుకోవడానికి బయటికి పంపాలన్న భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.






