- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
దిశ, వంగూర్ : మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన వంగూరి బైండ్ల బాలయ్య ఇటీవల గుండెపోటుతో మరణించడంతో ఆదివారం

దిశ, వంగూర్ : మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన వంగూరి బైండ్ల బాలయ్య ఇటీవల గుండెపోటుతో మరణించడంతో ఆదివారం వంగూరు గ్రామ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.35 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అతి చిన్న వయస్సు లో కథలు, ఆటపాటలతో అందర్నీ ఉత్సాహపరిచే వ్యక్తి నేడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అని ఆయన చేసిన సేవలు కొనియాడారు. బాలయ్య మరణం తీరని లోటు అని అన్నారు. కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటామని మనోధైర్యాన్ని కల్పించారు. ఆర్థిక సహాయం అందించిన వారిలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థాన కమిటీ అధ్యక్షులు బండపల్లి శివకుమార్, ఉపాధ్యక్షులు శ్రీశైలం, వగ్గు నారాయణ, ప్రధాన కార్యదర్శి బండపల్లి సైదులు, సహాయ కార్యదర్శులు కోటయ్య, మోహన్, కోశాధికారి అయినాల రమేష్, సాంస్కృతిక మరియు ప్రచార కార్యదర్శులు బండపల్లి రామస్వామి, శివుడు, ప్రవీణ్, గౌరవ అధ్యక్షులు బండపల్లి శివరాములు, పరమేష్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






