బాధిత కుటుంబానికి రూ.4 లక్షల ఆర్థిక సహాయం

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, పాన్ గ‌ల్ : మండల కేంద్రానికి చెందిన విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ గత పది రోజుల కిందట విద్యుత్ ఘతానికి గురై మృతి చెందిన మధుసూదన్

బాధిత కుటుంబానికి రూ.4 లక్షల ఆర్థిక సహాయం
X

దిశ‌, పాన్ గ‌ల్ : మండల కేంద్రానికి చెందిన విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ గత పది రోజుల కిందట విద్యుత్ ఘతానికి గురై మృతి చెందిన మధుసూదన్ యాదవ్ కుటుంబానికి శనివారం విద్యుత్ శాఖ తరపున ఏడి రాజయ్య గౌడ్ రూ. 4ల‌క్ష‌ల సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ విద్యుత్ శాఖలో తమకు నిత్యం అందుబాటులో ఉంటూ విద్యుత్ ఘాతానికి మృతి చెందడం బాధాకరమన్నారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని.. గతంలో ఇచ్చిన హామీ మేరకు నేడు తల్లిదండ్రులకు రూ. 4 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన‌ట్టు తెలిపారు. కార్యక్రమంలో ఏఈ చందర్ కుమార్ రెడ్డి, లైన్ మెన్లు రామకృష్ణ, వెంకటయ్య, కాంగ్రెస్ మండల నాయకులు రాము యాదవ్ మన్యం హనుమంతు, వెంకటయ్య పాల్గొన్నారు.

Next Story